ఘట్కేసర్ కారు ప్రమాదంలో బిగ్‌ట్విస్ట్..! 1 d ago
TG: ఘట్కేసర్ కారు మంటల్లో ఇద్దరు సజీవ దహనం అయ్యిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అది ప్రమాదం కాదు ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. కారు మంటల్లో శ్రీరామ్, లిఖిత సజీవదహనం అయ్యారు. శ్రీరామ్ది పోచంపల్లి మండలం పిలాయిపల్లి గ్రామం..లిఖితది చౌదరిగూడెం గ్రామం. ఇంటర్ చదువుతున్న లిఖితను శ్రీరామ్ ప్రేమించాడు. శ్రీరామ్‌ను చింటూ, అతని స్నేహితులు వేధించారు. ఆ కారణంగానే ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఐదేళ్ల నుంచి శ్రీరామ్, లిఖిత ప్రేమించుకుంటున్నారు. ఇద్దరినీ బెదిరించి చింటూ డబ్బులు వసూలు చేస్తున్నాడు. చింటూకి డబ్బులు ఇవ్వడం కోసం శ్రీరామ్ అప్పులు చేసాడు. అప్పుల కోసం కాదు ప్రేమ కోసమే చనిపోతున్నామని లేఖలో శ్రీరామ్, లిఖిత వివరంగా రాసారు. ఆ దిశగానే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.